మహేష్ త్రివిక్రమ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వర్కింగ్ టైటిల్ ఎస్ఎస్ఎంబీ 28 గా నిర్నయించారు. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మహేశ్ బాబు రా ఏజెంట్ గా నటించబోతున్నాడని…ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి పార్థు అనే టైటిల్ ను త్రివిక్రమ్ అనుకుంటున్నారట.
త్రివిక్రమ్ మహేశ్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమాలో మహేశ్ బాబు పేరు పార్థసారది కాగా ముద్దుగా పార్థు అని పిలుచుకుంటారు. అయితే ఇప్పుడు అదే పేరును మహేశ్ 28కి అనుకుంటున్నారట. దీనిపై ఫైనల్ నిర్ణయం కూడా త్వరలోనే తీసుకోబోతున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా ప్రస్తుతం త్రివిక్రమ్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారిపాట సినిమాలో నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ మహేశ్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2022 జనవరిలో విడుదల చేయబోతున్నారు.