మ‌హేశ్-త్రివిక్ర‌మ్ అప్డేట్ వచ్చేసింది.!

mahesh babu trivikram movie update

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అనౌన్స్మెంట్ రానే వచ్చేసింది
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉండబోతుందని చిత్ర యూనిట్ అఫీషియల్ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే మహేష్ బాబు త్రివిక్రమ్ అతడు, ఖలేజా సినిమాలను తెరకెక్కించారు. అతడు సినిమా 2005 లో రాగా ఖలేజా 2010 లో వచ్చింది.

వీటిలో అతడు మంచి విజయం సాధించగా ఖలేజా మాత్రం నిరాశపర్చింది. థియేటర్లో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమాకు ఆ తరవాత మాత్రం పాజిటివ్ టాక్ వినిపించింది. ఇక ఇపుడు మళ్ళీ పదకొండేళ్లకు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ సినిమాను ఎస్ రాధాకృష్ణ హారికాహాసిని బ్యానర్ పై నిర్మిస్తస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.