టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. మహేష్ పోలీస్ స్టేషన్ కు వెళ్లడం ఏంటని అనుకుంటున్నారా.?నిజంగా అయన వెళ్ళింది జైలుకే.. అయితే వెళ్ళింది మాత్రం ఏదో చేసి కాదు కేవలం పోలీస్ స్టేషన్ ను సందర్శించడానికి. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
బ్యాంకింగ్ రంగంలో జారుతున్న మోసాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. కాగా అక్కడ షూటింగ్ లో పాల్గొంటున్న మహేష్ గ్యాప్ లో దుబాయ్ లోని స్మార్ట్ జైలును సందర్శించేందుకు వెళ్లారు. ప్రపంచంలోనే మొదటి స్మార్ట్ పోలీస్ స్టేషన్ అయిన స్టేషన్ ను చూసి మహేష్ ఆశ్చర్య పోయారట. ఈ విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ మీడియా ప్రచురించింది.