బెల్లంకొండ కోసం రంగంలోకి మహేష్ బాబు డైరెక్టర్.. !

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. చివరగా అల్లుడు అదుర్స్ సినిమాతో బెల్లంకొండ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేకపోయింది. ఇక ఇప్పుడు సాయి శ్రీనివాస్ తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టారు. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చత్రపతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ లో చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగానే బెల్లంకొండ కోలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన కర్నన్ సినిమా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు.
ఇక ఇప్పుడు ఈ సినిమాకు డైరెక్టర్ ను వెతికే పనిలో ఉన్నారు. కాగా తాజా ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను సంప్రదించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల అసురన్ సినిమాను రీమేక్ గా నారప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటిస్తున్నారు. దాంతో కర్నన్ బాధ్యతలు కూడా శ్రీకాంత్ చేతిలో బాగుంటుందని ఆయన్ను సంప్రదించారట. ఇక శ్రీకాంత్ అడ్డాల గ్రీన్ సిగ్నల్ ఇస్తే వీరి కాంబినేషన్ లో సినిమా ఉండే అవకాశం ఉంది.