అడవిశేష్ మేజర్ విడుదల వాయిదా.. !

కరోనా విజృంభణ కారణంగా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో ఆచార్య, టక్ జగదీశ్, లవ్ స్టోరీ సహా పలు సినిమాలు రిలీజ్ ను వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లో అడవి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా కూడా చేరిపోయింది. ఈ చిత్రం రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు హీరో అడవిశేష్ బుధవారం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ పోస్ట్ చేశారు. మేజర్ చిత్రాన్ని ముందుగా జులై 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని అనుకున్నాం.
కానీ కరోనా పరిస్థితుల వల్ల విడుదలను వాయిదా వేస్తున్నాము. సినిమా విడుదలయ్యాక సెలబ్రేట్ చేసుకుందాం. మామూలుగా ఉండదు అంటూ అడవిశేష్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. మొత్తానికి మేజర్ కూడా పోస్ట్ పోన్ అయిందని క్లారిటీ వచ్చేంసింది. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి శషి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణణ్ కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాలో సోబితా దులిపాల, సాయి మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయబోతున్నారు.