మంచు లక్ష్మి లిప్ లాక్ వైరల్

మంచు లక్ష్మి లిప్ లాక్ వైరల్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి లిప్ లాక్ వైరల్ గా మారింది. నటి , నిర్మాత , విలన్ , హోస్ట్ గా ఇలా తనలోని టాలెంట్ లను బయటకు తీసి ప్రేక్షకులను అలరిస్తున్న మంచు లక్ష్మి..తాజాగా లెస్బియన్ క్యారెక్టర్‌లో నటిస్తుంది. ప్రస్తుతం ఓటీటీ బేస్డ్ వెబ్ సిరీస్‌లలో నటిస్తున్న మంచు లక్ష్మి.. తాజాగా మలయాళ సూపర్ స్టార్ మెహన్ లాల్ ‘మాన్‌స్టర్’ నటిస్తున్న మూవీ లో లెస్బియన్ రోల్‌లో కనిపించింది.

డిసెంబర్ 2 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక చివరి 30 నిమిషాల్లో మంచు లక్ష్మి విలనిజం సినిమాకే హైలైట్‌గా ఉందని అంటున్నారు. ఈ మూవీ మొత్తంలో హనీ రోజ్ ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా.. మోహన్ లాల్ కిల్లర్ లక్కీ సింగ్‌గా, సీక్రెట్ పోలీస్‌గా కూడా కనిపిస్తాడు. మంచు లక్ష్మి.. హనీ రోజ్ ఇంట్లో పనిమనిషిగా ఉంటుంది. అయితే, సెకండాఫ్‌లో వీరిద్దరూ లెస్బియన్స్ అని, రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే విషయం రివీల్ అవుతుంది. హనీ రోజ్, మంచు లక్ష్మి మధ్య లవ్ కెమిస్ట్రీని ఒక పాటలో చూపించారు. ఇందులో లిప్ లాక్స్ ఉన్నాయి. వీటి తాలూకా స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

follow us