ఒకటి కాబోతున్న మంచు మనోజ్ – భూమా మౌనిక..?

ఒకటి కాబోతున్న మంచు మనోజ్ – భూమా మౌనిక..?

గత కొద్దీ రోజులుగా మంచు మనోజ్ రెండో వివాహం చేసుకోబోతున్నాడని , భూమా మౌనిక ను మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో వీరిద్దరి వివాహ వేడుకకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మంచు మనోజ్ కడపలో ఉన్న పెద్ద దర్గా అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. ఫిబ్రవరి నుంచి కొత్త జీవితం ప్రారంభించనున్నట్లు చెప్పుకొచ్చారు. అదే సమయంలో కొత్త సినిమాల గురించి ప్రస్తావించారు. కానీ సినిమాలతో పాటు తన లైఫ్ కు సంబంధించి కూడా ఓ నిర్ణయం తీసుకున్నాడని , అదే రెండో వివాహం అని అంటున్నారు.

ఫిబ్రవరి 2, 2023 లో వీరిద్దరి వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. మంచు మనోజ్- మౌనిక కు ఇది రెండో వివాహం. ఇద్దరూ వ్యక్తిగత కారణాలతో తొలి వివాహ బంధానికి దూరం అయ్యారు. కొంత కాలంగా మంచు మనోజ్ – మౌనిక చెన్నైలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న వీరిద్దరూ వివాహానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

follow us

Related News