ఆస్ట్రేలియా లో  చిచ్చు : విల విల లాడుతున్న జంతువులు 

ఆస్ట్రేలియా లో  చిచ్చు : విల విల లాడుతున్న జంతువులు 

నాలుగు నెలల ముందు మొదలు అయినా కారు చిచ్చు ఇంకా ఆగలేదు.. వందలాది ముగా జీవులు ప్రాణాలు కోల్పోయాయి.. రోజు రోజుకు ఈ మంటలు పెరుగుతూనే పోతున్నాయి.. ఇప్పటికే 24 మంది ప్రాణాలు కోల్పోయారు  అలానే వందలాది జంతువులు సజీవదహనం అయ్యాయి.. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వేడి గాలులు వీస్తుండగా, ఉష్ణోగ్రతలు 48.9 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి.. మంటలు అదుపు చేయడానికి 3000 మందికి పైన సైనికులు ప్రయత్నిస్తున్నారు.. ఆస్ట్రేలియా ప్రజలు కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి జంతువులకి సహాయం అందిస్తున్నారు.. సోషల్ మీడియా లో పోస్ట్ చేసే పిక్చర్స్ చూస్తుంటే ఎవరి మనసు అయినా చలించక తప్పదు.. 

మొత్తం 60 లక్షల హెక్టార్లలో ఈ మంటలు వ్యాపించగా, న్యూసౌత్‌ వేల్స్‌లో మాత్రమే  40 లక్షల హెక్టార్లు, విక్టోరియాలో ఇంకో  8 లక్షల హెక్టార్లలో చెట్లు, పంటలు అగ్నికి ఆహుతయ్యాయి.. మంటలు అదుపు చేయడానికి వేలాది ఫైర్ ఇంజిన్స్ పని చేస్తున్నాయి.. వస్తున్న సమాచారం ప్రకారం ఆదివారం కి కొంచం మంటలు అదుపులోకి వచ్చాయి.. కానీ ఇంకా అప్రమత్తం గ ఉండాలి అని అధికారులు హెచ్చరించారు.. 

Tags

follow us

Web Stories