మత్తు వదలరా : కామెడీ త్రిల్లర్

Cine Chit Chat Rating : 3/5
చిత్రం: మత్తు వదలరా
జానర్: సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్
నటీనటులు: శ్రీసింహా, వెన్నెల కిశోర్, సత్య, అగస్త్య, బ్రహ్మాజీ
సంగీతం: కాలభైరవ
దర్శకత్వం: రితేష్ రానా
బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత
మత్తు వదలరా అంటూ రాజమౌళి కుటుంబం నుంచి ఇద్దరు వారసులు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నారు.. ఇప్పటి వరకు మనం రాజమౌళి కుటుంబం నుంచి వచ్చిన అన్ని రకాల టెక్నిషన్స్ చూశాము .. మొదటి సారి హీరో గా తెర మీద కి అరంగేట్రం చేశాడు కీరవాణి కుమారుడు శ్రీ సింహా.. అలానే ఇంకో కుమారుడు కాల భైరవ ఈ సినిమా కి సంగీతం అందించాడు.. అసలు ఈ సినిమా ఎలా తీశారో చూద్దాం..
Read Also :శాంతా రష్మిక కి అన్ని ఇవ్వాలి : రష్మిక మాజీ
కథ :
నాలుగు వేల జీతం కి డెలివరీ బాయ్ మన హీరో.. బాబు మోహన్ (శ్రీసింహా), ఏసుదాస్ (సత్య), అభి(అగస్త్య)లు రూమ్మేట్స్.. ఏసుదాసు, బాబు ఇద్దరు డెలివరీ బాయ్స్.. ఏసుదాసు చెప్పిన ఒక సలహా తో బాబు ఒక మర్డర్ కేసు లో ఇర్రుకుంటాడు.. ఇది ఒక సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ .. దర్శకడు రితేష్ రానా మొదటి సినిమా అయినా చాలా బాగా సస్పెన్స్ ని క్యారీ చేశాడు. సినిమా అంతా . అది ఏలా అంటే: ఏసుదాసు వేలకి వేలు సంపాదిస్తున్నాడు అదే కొరియర్ పని చేసి అది ఎలానో హీరో బాబు కి చెప్తాడు.. హీరో ముందుగా 500/- తీసుకోడానికి ఫిక్స్ అవ్వుతాడు ఒక ముసలమ్మా దగ్గర.. అక్కడ జరిగే తోపులాట లో ముసలమ్మా చచ్చిపోతుంది.. ఇంకా హీరో ఒక రూమ్ లో లాక్ అయ్యిపోతాడు.. అక్కడే ఇంకో మర్డర్ కూడా జరుగుతుంది.. హీరో బ్యాగ్ లోకి ఏకంగా 50 లక్షలు వచ్చి చేరుతాయి.. ఆ డబ్బులు ఎలా వచ్చాయి అక్కడకి హీరో స్నేహితులు వచ్చి ఎలా చేరుతారు.. ఎలా తప్పించుకుంటాడు.. ఇదే సినిమా కథనం..
విశ్లేషణ :
శ్రీ సింహ మొదటి సినిమా అయినా కానీ తన నటన లో అన్ని హావభావాలు చూపించాడు… ఒక హీరో ల కాకుండా పాత్ర లో ఒక డెలివరీ బాయ్ ఎలా ఉంటాడో అలానే కనిపిస్తాడు.. సత్య కామెడీ ఎక్కడ బోర్ కొట్టదు.. చెప్పాలి అంటే సినిమాకి ప్లస్ అయ్యాడు.. అలానే మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశాడు.. పాటలు ఉండవు.. ఒక పాట ఉంటుంది.. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చాలా మెప్పించాడు.. ఇంకా బ్రహ్మాజీ పాత్ర సినిమా కే హై లైట్.. క్లైమాక్స్ కామెడీ బ్రహ్మాజీదే.. తల లో రాడ్ దిగిన దానితో నడుస్తూ డైలాగ్ చెప్తుంటే మనకి నవ్వు ఆగదు.. దర్శకుడు చూపించిన సీరియల్ సీన్ కి యాప్ట్ ఈ సీన్ లోని సన్నివేశం అని అనిపిస్తుంది.. కీరవాణి కి పుత్రోత్సాహం ఈ సినిమా లో కొరత లేకుండా దొరికింది… అటు సంగీత దర్శకుడు రూపం లో ఇటు హీరో రూపం లో.. ఇద్దరు 99 మార్కులు సాధించారు అని చెప్పవచ్చు.. సెకండ్ కొంచెం ఫ్లాట్ అయ్యింది.. ఫస్ట్ హాఫ్ చూసాక మరి ఎక్సపెటేషన్స్ పెరిగి పోయి రెండో సగం ఆలా కనిపిస్తుంది కానీ.. లేక పోతే రెండో భాగం కూడా చాలా బాగా వచ్చింది అనే చెప్పాలి.. సినిమా కి కథ తో సమాంతరంగా సాగే టీవీ సీరియల్.. ఇంటి ముందు ఉండే పోలీస్ కానిస్టేబుల్.. సినిమా లో ప్రతిదీ చాలా జాగ్రత్త గా తీసాడు దర్శకుడు
Read Also : రామ్ చరణ్ సూపర్ హీరో గా ?
ప్లస్ పాయింట్స్:
శ్రీసింహా నటన
సత్య కామెడీ
కాలభైరవ మ్యూజిక్
కథనంసినిమాలో కొత్తదనం
మైనస్ పాయింట్స్ :
చెప్పడానికి ఏమి లేవు కానీ చెప్పాలి కాబట్టి సెకండ్ హాఫ్ ఇంకా హీరో గడ్డం..
ఈ వీక్ ఎండ్ ఆలోచించకుండా థియేటర్లలోకి వెళ్లి పోయి కూర్చోవచ్చు.. అది ఇంకా థ్రిల్లర్ కామెడీ నచ్చే వాళ్ళు అయితే ముందు ఆలోచించకుండా వెళ్లి పోండి ..
Cine Chit Chat Rating 3/5