“ఊర్వశివో రాక్షసివో” చిత్రం నుండి సెకెండ్ సింగిల్ “మాయారే” పాట విడుదల

“ఊర్వశివో రాక్షసివో” చిత్రం నుండి సెకెండ్ సింగిల్ “మాయారే” పాట విడుదల

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “ఊర్వశివో రాక్షసివో”

కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ తాజా చిత్రం “ఉర్వశివో రాక్షసివో” ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్ గా నటించింది. ఇదివరకే రిలీజ్ చేసిన “ఊర్వశివో రాక్షసివో” చిత్ర టీజర్ కు, అలానే సాంగ్ కు అనూహ్య స్పందన లభించింది.

“అరి” మూవీ క్యారెక్టర్ ఫస్ట్ లుక్స్

రాకేశ్‌ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 4న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ వరుస అప్‌డేట్‌లను ఇస్తున్నారు. ఈ సినిమాలోని ‘మాయారే’ అంటూ సాగే సెకండ్‌ సింగిల్‌ రిలీజ్ చేసారు చిత్రబృందం.రాహుల్‌ సిప్లీగంజ్‌ ఆలపించిన ఈ పాటను, కాసర్య శ్యామ్‌ రచించారు.

అనూప్‌రూబెన్స్,అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్‌ధీరజ్ మొగిలినేని నిర్మించారు. విజయ్ ఎం సహానిర్మతగా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

follow us

Related News