కమర్షియల్ యాడ్ తో వస్తున్న మీనా

కమర్షియల్ యాడ్ తో వస్తున్న మీనా

నటి మీనా మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతుంది. బాల నటిగా ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్న మీనా..ఆ తర్వాత హీరోయిన్ గా మారి తెలుగు, తమిళ్ తో పాటు ఇతర భాషల్లో వందల సినిమాలు చేసి అలరించింది. 2009లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌ ను మీనా వివాహం చేసుకొని.. సినిమాలకు కొంతకాలం దూరమైంది. ఆ తర్వాత కూడా పలు సినిమాలు చేసి మెప్పించింది. ఈ దంపతులకు నైనికా అనే కుమార్తె ఉంది. తేరీ (తెలుగులో పోలీస్) సినిమాలో నైనిక చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించింది. పోస్ట్ కొవిడ్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ 2022 జూన్ 28న రాత్రి చెన్నైలోని ఎంజీఎం ఆస్ప‌త్రిలో మీనా భ‌ర్త తుది శ్వాస విడిచారు.

విద్యా సాగర్ మృతి సమయంలోనే మీనా కొన్ని సినిమాలను కమిట్ అయ్యి ఉన్నారు. ఆ సినిమాలు కొన్ని క్యాన్సిల్ అవ్వగా కొన్ని అలాగే ఉండిపోయాయి. ఇక ఇప్పుడు ఆ సినిమాల షూటింగ్స్ లో మీనా మళ్లీ పాల్గొనబోతుంది. దృశ్యం 3 సినిమా తో ఆమె సినీ జర్నీ మళ్లీ మొదలు అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఒక కమర్షియల్ యాడ్ చిత్రీకరణలో మీనా పాల్గొంటున్నారు. ఆ వెంటనే సినిమా చిత్రీకరణలో కూడా పాల్గొనబోతున్నట్లుగా సమాచారం. మరి మీనా కు ఎలాంటి ఛాన్సులు వస్తాయో చూడాలి.

follow us

Related News