పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్…వకీల్ సాబ్ ఓటీటీ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!

  • Written By: Last Updated:
పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్…వకీల్ సాబ్ ఓటీటీ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తరవాత రీఎంట్రీ ఇచ్చిన సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. లైంగిక వేధింపులు ఎదురుకుంటున్న మహిళల హక్కుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమాలో అంజలి, నివేదిత థామస్, అనన్య కీలక పాత్రల్లో నటించారు. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రాన్ని ఎప్రిల్ 9 న థియేటర్ లో విడుదల చేసారు. ఈ సినిమాకి కలెక్షన్ ల వర్షం కురిసింది.

కరోనా తో మధ్యలోనే సినిమా కు బ్రేక్ పడినా అప్పటికే లాభాలు వచ్చాయని దిల్ తాజా వెల్లడించారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ లాభాల్లో వాటా కూడా అందుకున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఎప్రిల్ 30 నుండి ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక ఓటీటీ లో వకీల్ సాబ్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

follow us