క్రిస్టమస్ సంబరాల్లో మెగా , అల్లు ఫ్యామిలీ

క్రిస్టమస్ సంబరాల్లో మెగా , అల్లు ఫ్యామిలీ

మెగా , అల్లు ఫ్యామిలీ సభ్యులు క్రిస్టమస్ సంబరాల్లో మునిగిపోయారు. చిత్రసీమ లో మెగా , అల్లు ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అల్లు అరవింద్ , మెగాస్టార్ చిరంజీవి బావ మరదులే కాదు సొంత అన్నదమ్ముల్లాగా ఉంటారు. ఒకర్ని విడిచి ఒకరు ఉండరు. ఈ మధ్య రెండు ఫ్యామిలీ ల మధ్య కాస్త గ్యాప్ వచ్చిందనే వార్తలు ప్రచారం అయినప్పటికీ అందులో ఏమాత్రం నిజం లేదని , కట్టె కలేదాక చిరంజీవి పక్కనే ఉంటానని అల్లు అరవింద్ తేల్చి చెప్పారు.

ఇదిలా ఉంటె తాజాగా ఈ రెండు ఫ్యామిలీ సభ్యులంతా క్రిస్టమస్ సంబరాలు జరుపుకోవడం అభిమానులను సంతోషంలో పడేసింది. క్రిస్టమస్ సందర్భంగా శాంటా సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ ఈ ఫోటోలని షేర్ చేసింది.ఈ సెలెబ్రేషన్స్ కి అల్లు అర్జున్, రాంచరణ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్, వరుణ్ తేజ్, నిహారిక, సుస్మిత, ఉపాసన, శ్రీజ హాజరయ్యారు. ఇటీవలే రాంచరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో క్రిస్టమస్ వేడుకలు మెగా ఫ్యామిలి మరింత గ్రాండ్ గా జరపడానికి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయబోతున్నారని తెలుస్తోంది.

follow us