నాగబాబుపై నెటిజన్ల అసహనం !

  • Written By: Last Updated:
నాగబాబుపై నెటిజన్ల అసహనం !

మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటున్నాడో అందరికీ తెలిసిందే. నాగబాబు యూట్యూబ్ ఛానల్ లో కూడా తనకు సంబందించిన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ నుంచి కూడా రాబడి పెరగడంతో సెలెబ్రిటీస్ కొందరు ఇదే బాటపట్టారు. ఆమధ్యలో నాగబాబు ఇదే విషయమై స్పందిస్తూ, ఎదో సంపాదించడానికి ఈ వేదికను నేను ఉపయోగించుకోవట్లేదు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వచ్చాను అంటూ చెప్పుకొచ్చారు.

కాగా, తాజాగా నాగబాబు తన యూట్యూబ్ వీడియోలో ఒక యాప్ గూర్చి ప్రమోట్ చేయడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నాగబాబు ప్రోమోట్ చేసే ఆ యాప్ ప్లే స్టోర్ లో లేదు. గూగుల్ దాన్ని నిషేదించింది. అంతేకాదు అది ఒక థర్డ్ పార్టీకి సంబంధించిన యాప్ కావడంతో కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక స్థాయిలో ఉంటే ప్రముఖులు కూడా ఇలాంటి వాటిపై ఆధారపడి ప్రోమోట్ చేయడం పట్ల నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

follow us