క‌రోనాతో ఆస్ప‌త్రిలో చేరిన మెగా హీరో..!

  • Written By: Last Updated:
క‌రోనాతో ఆస్ప‌త్రిలో చేరిన మెగా హీరో..!

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజుకు పెరుగుతోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు సైతం కరోనా బారిన పడుతున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో లక్షణాలు పెద్దగా కనిపించకపోవడం ఊరట కలిగించే విషయం. ఇక సాధారణ ప్రజలతో పాటు సెలబ్రెటీలు రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రర్టీలు కరోనా బారినపడి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

మరికొందరు కరోనా నుండి కొలుకున్నారు. ఇక తాజాగా మరో మెగా హీరోకు కరోనా పాజిటివ్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండటం తో టెస్ట్ చేసుకున్నా అని పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ప్రస్తుత పలు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు.

follow us