వకీల్ సాబ్ కేసులనే కాదు మనసులను కూడా గెలుస్తాడు : మెగాస్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాగా..పవన్ కు జోడిగా శృతిహాసన్ నటించింది. ఇక ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా సినిమాలో పవన్ కళ్యాణ్ నటన…తమన్ సంగీతం సూపర్ గా ఉన్నాయంటూ అభిమానులు సెలబ్రెటీలు రివ్యూలు ఇస్తున్నారు. కాగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి వకీల్ సాబ్ పై రివ్యూ ఇచ్చారు. నిన్న రాత్రి మెగాస్టార్ తన తల్లి మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఏఎమ్బీ థియేటర్ లో వకీల్ సాబ్ సినిమాను చూసారు.
ఇక తాజాగా చిరు తన ట్విట్టర్ లో వకీల్ సాబ్ టీమ్ పై ప్రశంసలు కురిపించారు. మూడేళ్ళ తరవత కూడా పవన్ కళ్యాణ్ అదే వాడి.. అదే వేడి. అదే పవర్ చూపించాడని పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ తో కోర్ట్ డ్రామా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. నివేదిత థామస్, అంజలి, అనన్య వాళ్ళ పాత్రల్లో జీవించారని చిరు పేర్కొన్నారు. తమన్, డీఓపీ వినోద్ అద్భుతమైన పనితనం చూపించారని తెలిపారు. చిత్ర యూనిట్ కు కంగ్రాట్స్ చెబుతూ..వకీల్ సాబ్ కేసులనే కాకుండా మనసులను కూడా గెలుస్తారని తెలిపాడు.