జ‌గ‌న్ నిర్నయం పై ఎంతో సంతోషంగా ఉంది : చిరంజీవి

  • Written By: Last Updated:
జ‌గ‌న్ నిర్నయం పై ఎంతో సంతోషంగా ఉంది : చిరంజీవి

క‌ర్నూల్ జిల్లాలోని ఓర్వ‌క‌ల్ విమానాశ్రయానికి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల వాడ న‌ర్సింహారెడ్డి పేరును పెడుతున్న‌ట్టు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ విష‌యంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. విమానాశ్ర‌యానికి ఉయ్యాల వాడ న‌ర్సింహారెడ్డి పేరు పెట్ట‌డం పై ఆనందం వ్య‌క్తంచేశారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ లో ఓ పోస్ట్ పెట్టారు. క‌ర్నూలు విమానాశ్ర‌యానికి దేశంలోనే మొట్ట‌మొద‌టి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర్సింహారెడ్డి పేరు పెట్ట‌డం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.

విమానాశ్ర‌యానికి పేరు పెట్టడానికి ఉయ్యాల‌వాడ న‌ర్సింహారెడ్డి అర్హుడు. అలాంటి వ్య‌క్తి బయెపిక్ లో న‌టించ‌డం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అంటూ చిరు ట్వీట్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా మెగాస్టార్ హీరో హీరోగా ఉయ్యాల వాడ న‌ర్సింహారెడ్డి బ‌యోపిక్ ను సైరా న‌ర్సింహారెడ్డి పేరుతో తెర‌కెక్కించారు. ఈ సినిమాకు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రంలో న‌య‌నతార చిరుకు జంట‌గా న‌టించింది. ఈ సినిమా 2019 అక్టోబ‌ర్ 2న విడుద‌లై మంచి విజ‌యం సాధించింది.

follow us