అభిమానికి చిరంజీవి సహాయం !

స్వయం కృషి తో పైకి వచ్చిన హీరోల్లో మెగాస్టార్ ముందు వరసలో ఉంటారు. తన నటన తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వ్యక్తి చిరంజీవి. తన అభిమానులు ఎవరైనా కష్టాల్లో ఉన్నారని ఆయనకు తెలిస్తే ఆయనకు తోచినంత సహాయం చేస్తాడు. చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు.
బోనగిరి శేకర్ తోపుడు బండి పై మిర్చి వేస్తూ ఫ్యామిలీని నడుపుకుంటు వస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు పెద్దమ్మాయి వర్ష చిన్న అమ్మాయి నిఖిత. ఈయన రాష్ట్ర స్థాయి చిరంజీవి సేవ కార్యక్రమాలను నిర్వహిస్తు ఉంటాడు. పెద్దమ్మాయి వర్ష పెళ్లి ఈనెల 19 న జరుగుతుంది. అందుకు చిరంజీవి ఒక లక్ష రూపాయలు సహాయం చేశాడు.
బోనగిరి శేకర్ కుటుంబ పరిస్థితి తెలుసుకున్న చిరంజీవి. శేకర్ కూతురు పెళ్ళికి కావలిసిన డబ్బును అందించాడు. ఈ విషయం పై శేకర్ మాట్లాడుతూ ఆయన వారు, బందువులే తనని అదుకోలేదని చిరంజీవి గారు స్వయంగ నా కష్టం తెలుసుకుని సహాయం చేశారని శేకర్ కన్నీరు పెట్టుకున్నాడు. ఈ విషయంపై స్థానిక ఎంఎల్‌ఏ శంకర్ నాయక్ మాట్లాడుతూ చిరంజీవి గారు లక్ష రూపాయలు సహాయం చెయ్యడం సంతోషం గా ఉంది అన్నారు.
రవణం స్వామినాయుడు మాట్లాడుతూ అభిమానులు ఎవరు కష్టాల్లో ఉన్న నాకు చెప్పండి అని స్వయంగా నాతో చెప్పాడని చెప్పాడు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ కు సంబందించిన సభ్యులు, సంతోషం వార పత్రిక చీఫ్ సురేశ్ కొండేటి పాల్గొన్నారు.