మెగాస్టార్ కెరీర్ లో మణిశర్మ ఎన్నో సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ ను అందించారు. బావగారు బాగున్నారా.? సినిమాతో మొదలైన ఈ జోడి దాదాపు పది సినిమాలకు కలిసి పనిచేసింది. స్టాలిన్, ఇంద్ర, ఠాగూర్, అన్నయ్య లాంటి సినిమాలకు మణిశర్మ అందించిన సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణం గా చిరు సినిమాలకు మణిశర్మ ను దూరం పెట్టారట. ఒక్కసారి మనస్పర్థలు వస్తే మళ్లీ కలవకూడదు అని రూల్ ఏమి లేదు. కాబట్టి మణిశర్మ చిరు బర్త్ డే స్పెషల్ గా ఒక ఆల్బమ్ తీసి మళ్లీ దగ్గరయ్యారట.
ఇదిలా ఉండగా మణిశర్మ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు మ్యూజిక్ ఇచ్చి మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో మళ్ళీ హిట్ కాంబినేషన్ రిపీట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఆచార్య సినిమాను మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మను ఎంపిక చేశారు. కానీ ఇప్పటికే వచ్చిన టీజర్ మ్యూజిక్ అంత ఆకట్టుకునేలా లేకపోవడంతో చిరు మ్యూజిక్ పై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో మరోసారి మార్పులు చేయాలనీ కూడా సూచించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు వాస్తవమో తెలియాలంటే చిత్ర యూనిట్ నోరువిప్పే వరకు వెయిట్ చేయాలసిందే.