తెలుగు రాష్ట్రాల్లో మెగా ఆక్సీజన్ బ్యాంక్ లు..!

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దాంతో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సమస్యను తీర్చడానికి మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మెగాస్టార్ ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేయబోతున్నారట. మరో వారం రోజుల్లోనే ఇవి అందుబాటులోకి వస్తున్నట్టు సమాచారం.
ఈ ఆక్సిజన్ బ్యాంక్ లను అభిమాన సంఘాల పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ మరణించకూడదు అనే ఉద్దేశ్యం తోనే మెగాస్టార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా మెగాస్టార్ 1998 లోనే చిరంజీవి బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎంతోమందికి మేలు జరిగింది. ఇక ఇటీవల బ్లడ్ బ్యాంక్ కేంద్రాల ద్వారా ప్లాస్మా బ్యాంక్ లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఆక్సిజన్ బ్యాంక్ ను ఏర్పాటు చేస్తున్నారు.