మీకు మాత్రమే చెప్తా : షార్ట్ ఫిలిం కి కొంచం ఎక్కువ

విజయ్ దేవేరకొండ ప్రొడక్షన్ లో తరుణ్ భాస్కర్ హీరో గా ఈ శుక్రవారం మన ముందుకి మీకు మాత్రమే చెప్తా అంటూ శామీర్ ఈ వారం సినిమాని తీసుకొచ్చారు.
కథ :
రాకేష్ (తరుణ్ భాస్కర్ ) మరియు కామేష్ (అభినవ్ ) ఇద్దరు ఒక టీవీ ఛానల్ లో పని చేస్తుంటారు . రాకేష్ హీరోయిన్ స్టెఫి తో (వాణి భోజన్ ) తో ప్రేమ లో పడతాడు. పెళ్లి కూడా కుదురుతుంది . ఈ లోపు మన హీరో గారు యాక్ట్ చేసిన ఒక పాత వీడియో ఒకటి యూట్యూబ్ లో లీక్ అవ్వుతుంది. హీరోయిన్ ఆ వీడియో ని చూస్తదా ? హీరో హీరోయిన్ కి దొరికి పోయాడా మన హీరో అనేది సినిమా కథ .
విశ్లేషణ :
తరుణ్ భాస్కర్ హీరోగా బాగానే మెప్పించాడు . అభినవ్ – తరుణ్ బావుంది స్క్రీన్ మీద . వీళ్ళు మాట్లాడే తెలంగాణ బాషా ఇంకా హీరో పడే టెన్షన్ మనకి నవ్వు తెపిస్తుంది . పెరిగే యూట్యూబ్ వ్యూస్ హీరో పడే టెన్షన్ మీదే సినిమా అంత ఉంటుంది .
మొదటి భాగం అంత నవ్వుతూనే ఉంటాం . రెండో భాగం లో డైరెక్టర్ ఎదో చేద్దాము అనుకోని బోర్ కొట్టించాడు. దర్శకుడు కాబట్టి సినిమా ని ఫుల్ లెంగ్త్ లో మెప్పించలేక పోయాడు. షార్ట్ ఫిలిం డైరెక్టర్ తీసాడా అని మనకి సినిమా సెకండ్ హాఫ్ అంత అనిపిస్తునే ఉంటుంది. ఆ వీడియో ఎవరు లీక్ చేసాడు ఎందుకు చేసాడు అనే జస్టిఫికేషన్ కూడా బోర్ కొట్టించాడు డైరెక్టర్
ప్రొడ్యూసర్ విజయ్ దేవేరుకోండ పిసినారి అని బాగా తెలుస్తుంది . అయన సంపాదించినా 70% దీనిలోనే పెట్ట అని అన్నారు . మరి అయన యంత సంపాదించాడూ యంత పెట్టాడో తెలియదు కానీ మనకి సినిమా చాల చీప్ గ కనిపిస్తుంది.
ఒక్కరు తెలిసిన వాళ్ళు లేరు సినిమా లో అనసూయ తప్ప . దానికి కోసమే ఆమెగానీ పెట్టుకున్నారా అని డౌట్ కొద వస్తుంది.
తీర్పు :
షార్ట్ ఫిలిం డబ్బులతో తీసిన సినిమా . సినిమా కి తక్కువ షార్ట్ ఫిలిం కి ఎక్కువ.