ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు..ఎమ్మెల్యే కవిత ఏమంటుందంటే

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు..ఎమ్మెల్యే కవిత ఏమంటుందంటే

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురికి ఈడీ నుండి నోటీసులు రావడం..అరెస్ట్ లు కావడం వంటివి జరిగాయి. తాజాగా టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ఇందులో ఉన్నట్లు తేలడం తో తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. గురువారం తన పేరు బయటకు రావడం ఫై కవిత మీడియా తో స్పందించింది. మోడీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో 9 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చారని విమర్శించారు. వచ్చే డిసెంబర్‌లో తెలంగాణలో ఎన్నికలున్నాయని.. అందుకే మోడీ వచ్చే ముందు ఈడీ ఇక్కడికి వచ్చిందన్నారు.

ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం.. బీజేపీ నీచమైన రాజకీయ ఎత్తుగడ అని అన్నారు. తాను ఎలాంటి విచారణ ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాని స్పష్టం చేశారు. ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం చెపుతానని తెలిపారు. గత కొన్నేళ్లుగా దేశ ప్రజలు ఈ పరిణామాలను గుర్తిస్తూనే ఉన్నారని అన్నారు. ‘నా మీద కావచ్చు, మన మంత్రులు, ఎమ్మెల్యే మీద కావచ్చు ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం అన్నది బిజెపి యొక్క హీనమై, నీచమైన రాజకీయ ఎత్తుగడ తప్పా ఇందులో ఏమీ లేదు. దాన్ని మనం పట్టించుకోనవసరం లేదు. అయోమయానికి గురికావాల్సిన అవసరం అంతకన్నా లేదు’ కవిత అన్నారు.

follow us

Related News