అక్కినేని వారి కోడ‌లికి మోహ‌న్ బాబు స‌పోర్ట్‌..!‌‌

  • Written By: Last Updated:
అక్కినేని వారి కోడ‌లికి మోహ‌న్ బాబు స‌పోర్ట్‌..!‌‌

అక్కినేని వారి కోడ‌లు స‌మంత ప్రస్తుతం గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంత‌లం అనే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. సినిమాలో స‌మంత మొద‌టి సారి పౌరానిక పాత్ర‌లో న‌టిస్తోంది.అయితే ఈ చిత్రంలో ఎన్నో పౌరానిక, సాంఘీక పాత్ర‌లు చేసిన మోహ‌న్ బాబు కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సినిమాలో మోహ‌న్ బాబుకు దుర్వాస‌న మ‌హ‌ర్షి పాత్ర‌ను ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఇక సినిమాలో హీరోగా దుశ్యంతుని పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ న‌టిస్తున్నార‌నే విష‌యాన్ని ఇప్ప‌టికే అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే సినిమాలో స‌మంత మోహ‌న్ బాబు పాత్ర‌ల ప‌రంగా సినిమాలో సమంత‌కు మోహ‌న్ బాబుకు స‌పోర్ట్ ఉంటుంద‌ని టాక్‌. అయితే ఇందులో ఎంత‌వ‌ర‌కు వాస్త‌వం ఉందో తెలియాలంటే అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ వ‌చ్చేవ‌ర‌కు ఆగాల్సిందే. ఇక పౌరాణిక గాత‌గా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అత్యున్న‌త సాంకేతిక విలువ‌ల‌తో తెర‌కెక్కిస్తున్నార‌ట‌. మ‌రో వారం రోజుల్లో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.

follow us

Related News