మోక్షజ్ఞ నయా లుక్ వైరల్

నందమూరి ఫ్యామిలీ నుండి ఇప్పటికే ఎంతోమంది చిత్రసీమకు పరిచమై, ప్రేక్షకులను , అభిమానులను అలరించారు. నటులుగా, నిర్మాతలుగా పరిచమయ్యారు. అయితే ప్రస్తుతం నందమూరి అభిమానులతో పాటు యావత్ సినీ లవర్స్ నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా అదిగో..ఇదిగో అంటున్నారు తప్ప మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం ఖరారు కావడం లేదు. ఆ మధ్య విపరీతమైన లావుగా కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు మోక్షజ్ఞ. ఆ లుక్ లో మోక్షజ్ఞ ను చూసి ఇప్పట్లో ఇండస్ట్రీ కి రావడం మోక్షజ్ఞ కు ఏమాత్రం ఇష్టం లేదని అనిపిస్తుందని అంత కామెంట్స్ వేశారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు కూడా మోక్షజ్ఞ లుక్ బయటకు రాలేదు.
ఈ తరుణంలో తాజాగా మోక్షజ్ఞ సంబంధించిన సరికొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ లుక్ లో చాల సన్నగా కనిపించి ఆశ్చర్యపరిచారు. ఈ లుక్ ను చూసి చాలామంది హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు కామెంట్స్ వేస్తున్నారు. రీసెంట్ గా బాలకృష్ణ సైతం ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999ను తెరపైకి తీసుకురావచ్చు అని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ లో మోక్షజ్ఞ నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ప్రస్తుతం మోక్షజ్ఞ ఎంట్రీ ఆ మూవీ తోనే ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరి అదే నిజమవుతుందా..లేదా అనేది చూడాలి.