‘మోనాల్’ కన్నీళ్లు.. పెర్ఫార్మన్స్ ఇరగదీస్తుందంటూ..

  • Written By: Last Updated:
‘మోనాల్’ కన్నీళ్లు.. పెర్ఫార్మన్స్ ఇరగదీస్తుందంటూ..

బిగ్ బాస్ 4 గ్లామర్ బ్యూటీ మోనాల్‌ని ఏకంగా ‘ఆట’ డాన్స్ షో జడ్జీ కుర్చీలో కుర్చోబెట్టాడు ఓంకార్ అన్నయ్య. డాన్స్ పెర్ఫామెన్స్‌లను పక్కన పెడితే.. వాళ్ల డాన్స్ పెర్ఫామెన్స్ కంటే వీళ్ల జడ్జిమెంట్ పెర్ఫామెన్సే ఎక్కువ ఉంది. ఒకర్నిమించి ఒకరు వార్నాయనో అనట్టుగానే డాన్స్ షోని కామెడీ షో చేసి పారేస్తున్నారు. తాజా ప్రోమోలో ఇంకాస్త డోస్ పెంచింది మోనాల్ గజ్జర్. అనీ మాస్టర్, బాబా భాస్కర్‌లు డాన్స్ పెర్ఫామెన్స్ ఇవ్వగా.. ఆ తరువాత మోనాల్, యష్ మాస్టర్ ఇద్దరూ కలిసి డ్యుయెట్ వేసుకున్నారు. మోనాల్‌తో మళ్లీ డాన్స్ చేయించే ప్రయత్నం చేసి దాన్ని కామెడీ చేసిపారేశాడు బాబా భాస్కర్. ఇక చివర్లో అనీ మాస్టర్.. డాన్స్ చేసి పెర్ఫామెన్స్ ఇవ్వడం.. దాన్ని రఘు మాస్టర్ పొగడటం.. అనీ మాస్టర్.. ఇట్స్ నాట్ ఈజీ అంటూ కన్నీళ్లు పెట్టుకోవడంతో నాటకీయత జోడించగా.. ఇక ఏడ్వడంలో నా తరువాతే అన్నట్టుగా ఓ రేంజ్ పెర్ఫామెన్స్ ఇచ్చే మోనాల్‌ని చుట్టేశాయి కెమెరాలు. ఆమె ఏడ్వడం.. మన ఓంకార్ అన్నయ్య కెమెరాలు జూమ్‌లో పెట్టి మరీ మోనాల్ ఏడుపుని చూపించడంతో.. అబ్బో ఆమె పెర్ఫార్మన్స్ మామూలుగా లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

follow us