‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కు థియేటర్ల సమస్య

  • Written By: Last Updated:
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కు థియేటర్ల సమస్య

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే చిత్రం చేస్తున్నాడు అఖిల్. లాక్ డౌన్ తర్వాత రీస్టార్ట్ అయిన ఈ మూవీ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే.. ఈ జనవరిలోనే సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంది యూనిట్. కానీ.. సంక్రాంతి రేస్ నుండి తప్పుకుంది. లేటెస్ట్ గా ఈ మూవీని సమ్మర్ బరిలో నిలపాలని భావిస్తోంది చిత్ర బృందం. ఇలా వెనక్కు వెళ్లడానికి పోటీనే కారణమని తెలుస్తోంది. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలో బరిలో నిలిచాయి. ‘క్రాక్ మాస్టర్’ ‘రెడ్ అల్లుడు అదుర్స్’ చిత్రాలు వచ్చేస్తున్నాయి. అసలే 50 శాతం ఆక్యుపెన్సీ పైగా నాలుగు చిత్రాలతో పోటీ. ఇదంతా అవసరమా ? వెనక్కి తగ్గిందట యూనిట్. పోనీ ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దామంటే.. ‘ఉప్పెన ఏ1 ఎక్స్ ప్రెస్’ మార్చిలో ‘రంగ్ దే లవ్ స్టోరీ’. ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ నాని ‘టక్ జగదీష్’ డబ్బింగ్ చిత్రం ‘కెజిఎఫ్ 2’ రాబోతున్నాయి. అందుకే సోలోగా మేలో వస్తే బాగుంటుందని భావిస్తున్నారట మేకర్స్. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

follow us