మైత్రీమూవీమేకర్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.!

mythri movie makers confirmed that their next venture with JrNtr and PrashanthNeel
mythri movie makers confirmed that their next venture with JrNtr and PrashanthNeel

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో “ఆర్ఆర్ఆర్” సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ గా చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తి చేసిన తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల సినిమాకు “అయినను పోయి రావలె హస్తినకు” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జూనియర్ శ్రీదేవి జాహ్నవి కపూర్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు.

అంతే కాకుండా విలన్ గా తమిళ హీరో శింబు ను తీసుకోవాలంటుకుంటున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ విషయాన్ని మైత్రీమూవీమేకర్స్ నిర్మాతలు ధ్రువీకరించారు. ఉప్పెన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. దాంతో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ యాష్ టాగ్ లకు ట్రెండింగ్ లోకి తీసుకువచ్చారు. ఇక త్రివిక్రమ్ తో సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.