NTR 30 : ఎన్టీఆర్ కు జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాలతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సినిమా జూన్ లేదా జులై లో సెట్స్ లోకి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా పై ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ నబా నటేష్ హీరోయిన్ గా నటించబోతుందట. సినిమాలో ఇద్దరు హీయాయిన్స్ కాగా ఒక హీరోయిన్ గా నబా నటేష్ నటించబోతుందని సమాచారం.
నబా నటేష్..సుధీర్ బాబు హీరోగా నటించిన “నన్ను దోచుకుందువటే” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తరువాత మూడు నాలుగు సినిమాలు చేసింది. కానీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన “ఇస్మార్ శంకర్” సినిమాతో ఇస్మార్ట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో నబా నటేష్ అందానికి అభినయానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న మాస్ట్రో సినిమాలోనూ నితిన్ కు జోడీగా అంటిస్తోంది.