బాలీవుడ్ హీరో తో ప్రేమలో పడ్డ ఇస్మార్ట్ బ్యూటీ

  • Written By: Last Updated:
బాలీవుడ్ హీరో తో ప్రేమలో పడ్డ ఇస్మార్ట్ బ్యూటీ

“నన్ను దోచుకుందువటే” సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నభ నటేష్ కు ఆ సినిమా ప్లాప్ తో చాలా రోజులవరకు చేతిలో సినిమా లేకుండా ఖాళీ గా ఉంది. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న పూరీ. మూవీస్ లో ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న నభ నటేష్ ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ కు జోడీ గా తీసుకున్నాడు. పాత్ర నిడివి తక్కువ అయిన గ్లామర్ షో చేసి తరువాతి మూవీస్ లో ఆఫర్స్ ను కొట్టేసింది. ఇప్పుడు అమ్మడి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి, అందులో సాయి ధరమ్ తేజ్ తో “సోలో బ్రతుకే సొ బెటర్”, నితిన్ “అందాధూన్” తెలుగు రీమేక్ లో ఛాన్స్ కొట్టేసింది. బెల్లం కొండ సాయి శ్రీనివాస్ “అల్లుడు అదుర్స్” లో ను నటిస్తుంది.

నభ తాను బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖాన్ ను లవ్ చేస్తున్నాను అని, నా చిన్నప్పటి నుండి కూడా నాకు షారుక్ అంటే ఇష్టం అని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. నా ప్రేమ ఇప్పటి నుండి కాదు నేను కాలేజీ చేసే టైమ్ నుండి ప్రేమిస్తున్నాను. చదువుకునే రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు హీరో, హీరోయిన్స్ ను ఎలా లవ్ చేస్తారో ఆవిదంగానే నేను లవ్ చేశాను అని చెప్పింది. షారూఖ్ నటించిన “కుచ్ కుచ్ హోతా హై” సినిమా నేను చాలా సార్లు చూశాను ఆ చిత్రం అంటే నాకు చాలా ఇష్టం అన్నది. నా అభిమాన హీరో కూడా షారుఖాన్ అంటూ చెప్పింది

follow us