ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా..పక్కకు జరిగిన లెజెండ్..!

ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి ఆదిపురుష్, సలార్ సినిమాలను పట్టాలెక్కించారు. వీటిలో ఇప్పటికే ఆది పురుష్ షూటింగ్ 30 శాతం పూర్తయింది. ఇక సలార్ సినిమా షూటింగ్ కూడా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇదిలా ఉండగా ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ప్రభాస్ నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా ఏకంగా ప్యాన్ వరల్డ్ సినిమా అని వెల్లడించారు. అంతే కాకుండా సైన్స్ ఫిక్షన్ కథాంశం నేపథ్యంలో సినిమా ఉంటుందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు.
ఇక ఈ సినిమాలో లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ ను కూడా భాగం చేస్తున్నట్టు అప్పట్లో వైజయంతి మూవీస్ ప్రకటన విడుదల చేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం సింగీతం శ్రీనివాస్ ఈ సినిమా నుండి తప్పుకున్నారట. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లనే సింగీతం తప్పనుకున్నారని టాక్. ముందుగా సూచనలు సలహాల కోసమే సింగీతం ను ప్రాజెక్టు లో భాగం చేయగా ఇప్పుడు నాగ్ అశ్విన్ ఆయన సలహాలను లైట్ తీసుకుంటున్నారట. దాంతో సింగీతం కు కోపం వచ్చేసి ప్రాజెక్టును నుండి తప్పుకున్నారట.