ప్రభాస్ సినిమాపై ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ రివీల్ చేసిన నాగ్ అశ్విన్..!

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్టటికే ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకోగా కొన్ని సీన్లను రీషూట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ దర్శకడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమా ఇప్పటికే 30శాతం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. మరో వైపు ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ మూడు సినిమాల తరవాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కాగా నాగ్ అశ్విన్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఇంటర్యూలో ప్రభాస్ సినిమాపై ఆసక్తికర విషయాలు భయటపెట్టారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ…ప్రభాస్ ఇదివరకు ఇలాంటి కథలు చేయలేదు. ఈ సినిమా ప్రేక్షకులను ఒక అద్భుత ప్రపంచంలోకి తీసుకువెలుతుంది. అంతే కాకుండా ఈ సినిమా కోసం హాలీవుడ్ లెవెల్ లో గ్రాఫిక్స్ ఉండబోతుంది. మరోవైపు అంతర్జాతీయ స్థాయి సెట్స్ ను ఈ సినిమాకోసం వాడబోతున్నాం. ఇది ఒక సోషియో ఫాంటసీ సినిమా. ఈ సినిమా ఆలస్యం అవుతున్నందుకు బాధగానే ఉంది కానీ సినిమా వచ్చాక మాత్రం మంచి ఫీలింగ్ కలుగుతుంది.