ప్రభాస్ కిల్లర్ అప్డేట్ ఇస్తానంటున్న నాగ అశ్విన్

ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్సకత్వంలో పాన్ ఇండియా మూవీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.. కాకపోతే కరోనా వైరస్ , లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంతలోనే ప్రభాస్ బర్త్డే అక్టోబర్ 23 దగ్గరకి రావడంతో ఫ్యాన్స్ ఇప్పటి నుండే సెలెబ్రేషన్స్ మొదలు పెట్టారు.
అయితే ప్రభాస్ చేస్తున్న సినిమాల నుండి ఫ్యాన్స్ టీజర్ లేదా పోస్టర్ లేదా ఆయన చేస్తున్న సినిమా అప్డేట్ ఎక్స్ పెట్ చేస్తున్నారు, దాంతో ఏ రోజు ప్రభాస్ ఫ్యాన్ నాగ అశ్విన్ ని ప్రభాస్ బర్త్డే అప్డేట్ అడగ్గా ” కరోనా వల్ల సినిమా స్టార్ట్ అవలేదు , ఇంకా సినిమా స్టార్ట్ అవడానికి చాలా టైం ఉంది, ఎక్కువ రెవీల్ చేయలేను కానీ , ఒక కిల్లర్ అప్డేట్ అయితే బర్త్డే కి ఇస్తాను ” అని ట్విట్టర్ ద్వారా ప్రభాస్ ఫ్యాన్ కి రిప్లై ఇచ్చారు నాగ అశ్విన్.