నాగబాబు : బాలయ్య బాబు ఎవరో తెలియదు.. , నందమూరి సింహం నా ” బ్రదర్ ” ..

మెగా ఫ్యామిలీ లో కాంటర్వేర్స్ స్టేట్మెంట్స్ ఇచ్చే వారు ఎవరు అయినా ఉన్నారు అంటే అది నాగబాబు గారే , రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కి తోడుగా ఉండి జనసేన పార్టీ కార్యక్రమాలని విజయవంతం చేయడంలో ముందు ఉండే నాగబాబు , తన అన్నయ్య చిరంజీవి , తమ్ముడు పవన్ కళ్యాణ్ లని ఎవరు ఎమన్నా ముందు ఉండి ఎదురుకుంటారు.
అయితే గత రాజకీయాల్లో భాగంగా అలాగే బాలయ్య బాబు తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ చేసే టైం లో తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో రిలీజ్ చేసారు , అందులో ఇండైరెక్ట్ గా బాలయ్య బాబు అంటే ఎవరో తెలియదని అలాగే తనకి తెలిసిన బాలయ్య ఒక కామెడియన్ అని చెప్పారు. అదే నాగ బాబు ఏ రోజు విచిత్రంగా ఆయన ఇంస్ట్గ్రామ్ అకౌంట్ లో బాలయ్య , తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటో ని షేర్ చేశారు , షేర్ చేయడమే కాకుండా బాలయ్య బాబు ని బ్రదర్ అని సంబోదించడమే కాకుండా నందమూరి సింహం అని పోస్ట్ చేశారు.
ఇన్ని మాటలు , కామెంట్స్ చేయగల సత్తా మన నాగ బాబు గారికే చెల్లుతది.