ఇంట గెలవని నాగ బాబు ప్రజలకు సలహాలు

ఇంట గెలవని నాగ బాబు ప్రజలకు సలహాలు
మెగా బ్రదర్ బ్రదర్ నాగ బాబు ఎప్పటిలానే ఈ రోజు ప్రస్తుత పరిస్థితుల మీద ట్వీట్ చేసేసారు..
ఈ రోజు చైనా యాప్స్ మీద చైనా వస్తువుల మీద పడ్డారు.. ఇంత వరకు బాగానే ఉంది.. మన దేశం లో రెవిన్యూ పెంచుకోడానికి మనం మన వస్తువులనే వాడుదాం అంటూ.. వచ్చిన డబ్బు తో దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం అంటూ ఇచ్చిన మెసేజ్ చాలా బాగుంది.. కానీ మెగా డాటర్ నిహారిక టిక్ టాక్ లో బోలెడెంత ఫాలోయింగ్, బోలెడు వీడియోలు అబ్బో నిహారిక టిక్ టాక్ స్టార్ అనవచ్చు.. మరి సొంత కూతురుకే చెప్పి చైనా యాప్ ను వాడకుండా చెయ్యని నాగ బాబు తెలుగు రాష్ట్ర ప్రజలకు సలహాలు ఇవ్వడం ఎందుకో.. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవడానికి ట్రై చేస్తే బాగుంటుంది ఏమో..
నాగ బాబు ఇలా ట్వీట్ చేసారు “మన దేశాన్ని ఆక్రమించుకోవలని చూస్తున్న చైనా వస్తువుల్ని,సెల్ ఫోన్ apps ని బహిష్కరిద్దాం.మన దేశం లో తయారైన వస్తువుల ని కొందాం.ప్రపంచం లో మన దేశం పెద్ద మార్కెట్.అన్ని దేశాల వస్తువులు ఇక్కడ అమ్మి సొమ్ము చేసుకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు .. అదే మన ప్రొడక్ట్స్ ని మనమే కొంటె మన దేశమే లాభపడుతుంది.తిరిగి ఆ డబ్బుతో మన దేశం అభివృద్ధి చెందుతుంది.మనందరం బాగుపడతాం.మన డబ్బు మన దేశంలో నే వుంటుంది, మనమే బాగుపడదాం. అంతే కాని మన డబ్బుతో బాగుపడి మన దేశాన్ని అక్రమించుకోవలని చూసే చైనా వస్తువుల్ని ban చేద్దామ్”.
