ఆ లిస్ట్ లో చేరిపోయిన చైతూ సినిమా..!

  • Written By: Last Updated:
ఆ లిస్ట్ లో చేరిపోయిన చైతూ సినిమా..!

ప్ర‌స్తుతం క‌రోనా విజృంభ‌న నేప‌థ్యంలో దాదాపు అన్ని సినిమాల షూటింగ్ లు వాయిదా ప‌డ్డాయి. ఆచార్య‌, ఆర్ఆర్ఆర్, పుష్ప తో పాటు మ‌రిన్ని సినిమాల షూటింగ్ లు వాయిదా ప‌డ్డాయి. అంతే కాకుండా విడ‌ద‌ల‌కు సిద్దంగా ఉన్న సినిమాలు కూడా విడుద‌ల‌ను వాయిదా వేసుకున్నాయి. అయితే నాగచైత‌న్య హీరోగా న‌టిస్తున్న థాంక్యూ సినిమా మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ షూటింగ్ ను ష‌ర‌వేగంగా జ‌రుపుకుంది. క‌రోనా టైం లోనూ ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకోవడానికి కార‌ణం ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ను ఇట‌లీ లో జ‌రుపుతున్నారు. మ‌న‌ద‌గ్గ‌రంటే క‌రోనా ఉంది కానీ అక్క‌డ ప‌రిస్థితులు సాధార‌ణంగానే ఉన్నాయి.

అందువ‌ల్లే అక్క‌డ షూటింగ్ ఇన్నాళ్లు స‌జావుగా జ‌రిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కూడా ర‌ద్దు చేసుకుంది. దానికి కార‌ణం ఇండియాలో కేసులు పెరుగుతుండ‌టంతో అన్ని దేశాలు మ‌న దేశం నుండి రాక‌పోక‌ల‌ను నిలిపివేశాయి. అయితే ఇప్పుడు థాంక్యూ సినిమా షూటింగ్ కోసం ప్ర‌కాశ్ రాజ్ తో పాటు మ‌రికొంద‌రు నటీన‌టులు వెళ్లాల్సిఉంది. కానీ ఆంక్ష‌లు ఉండ‌టంతో వాళ్లు వెల్ల‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దాంతో చేసేది లేక సినిమా షూటింగ్ ను ర‌ద్దు చేసుకున్నారట‌. అంతే కాకుండా ఇండియాకు చిత్ర యూనిట్ ప‌వ‌య‌న‌య్యింది. ఇప్పుడు వాయిదా వేసుకున్న లిస్ట్ లోనే చైతూ సినిమా కూడా చేరిపోయింది.

follow us