“ఖుషీ ఖుషీగా” నెగటివ్ కామెంట్స్ పై నాగబాబు ఫైర్…!

“జబర్దస్త్” షో ద్వారా నవ్వుల రారాజు గా గుర్తింపు తెచ్చుకున్న నాగబాబు. ఆ షో కి గుడ్ బై చెప్పి “అదిరింది” షోకు వెల్ కమ్ చెప్పిన సంగతి అందరికి తెలిసిందే. ఈ మధ్య కాలంలో నాగబాబు తన యూట్యూబ్ చానల్ ద్వారా అందరికీ టచ్ లో ఉంటూ తనకు తెలిసిన విషయాలను ఆ చానల్ ద్వారా అందరితో షేర్ చేసుకుంటున్నాడు. తాజాగా “ఖుషీ ఖుషీగా” స్టాండప్ కామెడీని తన యూట్యూబ్ చానల్ ద్వారా తీసుకువస్తున్నాడు. రీసెంట్ గా ఆ షో కి సంబందించిన ప్రోమో కూడా వదిలాడు.
గతంలో నాగబాబు చెప్పిన విదంగా మీలో ఎవరైనా కామెడీ చెయ్యగల సత్త ఉంటే ఓ ఐదు నిమిషాల కామిడి వీడియో ను పంపించమనడంతో, పబ్లిక్ నుండి విపరీతమైన రేస్ఫాన్స్ వచ్చింది. వాళ్ళు పంపించిన వీడియో లో సెలక్టివ్ ను ఎంపిక చేసుకొని “ఖుషీ ఖుషీగా” అంటూ ప్రోమో విడుదల చేశాడు. డబల్ మీనింగ్ తో, కూడిన కామిడీ ఎక్కువ ఉండటంతో నెటిజన్స్ చెత్త కామిడి. బూతులు ఎక్కువ వాడుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం పై నాగబాబు స్పందిస్తూ. ఖుషీ ఖుషీగా’ ప్రోమో కు మంచి రేస్ఫాన్స్ వచ్చినందుకు ధన్యవాదలు. నెగటివ్ కామెంట్స్ పై నాగబాబు సీరియస్ అయ్యాడు. ప్రతి సన్యాసి తనకు అంత తెలుసు అనుకునే బ్రమ లో ఉంటాడు అందుకే ఎదుటివాడు చేసిన పనిలో తప్పు వెతుకుతూ ఉంటాడు.
అలాంటి వాళ్ళను నేను పట్టించుకొను. తమిళ్, హిందీలో ఫేమస్ అయిన కామిడిని నేను తెలుగులోకి తీసుకువస్తున్నాను. స్టాండప్ కామిడి అంటే ఎంతో ట్యాలెంట్ ఉండాలి. ఓ వ్యక్తి తనకు ఎదురైన అనుభవాలకు హాస్యం జోడించి చేసేది. దానికి అంటూ ఓ ఫ్లో ఉంటుంది. జబర్దస్త్, అదిరింది లాగా స్క్రిప్ట్ ప్రోగ్రాం కాదు. అలాంటి కామిడి చేసే వ్యక్తులు ఎందరో ఉంటారు వాళ్ళను వెలుగులోకి తీసుకురావడమే మా “ఖుషీ ఖుషీగా” ప్రత్యేకత. 18 నుండి 40 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకు అందిస్తున్న కామెడి ఇది. యూట్యూబ్ ద్వారా వస్తుంది. కావున చూడటం, చూడకపోవడం మీ ఇష్టం, కానీ నెగటివ్ గా కామెంట్స్ చెయ్యకండి ఏమైనా బూతు కంటెంట్ ఉంటే మేమే కట్ చేస్తాం అన్నారు. ఈ షో చేయవద్దు అని కొందరు నాకు చెబుతున్నారు అలాంటివారు మాత్రం చాగంటి, గరికపాటి, ప్రవచనాలు వినండి. నేనుకూడా వాటిని ఫాలో అవ్వుతా అంటూ ఓ చిన్న టచ్ ఇచ్చారు.