సింగర్ సునీత పెళ్లి.. విమర్శలపై నాగబాబు కామెంట్స్

  • Written By: Last Updated:
సింగర్ సునీత పెళ్లి.. విమర్శలపై నాగబాబు కామెంట్స్

ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత రెండో వివాహం రామ్ వీరపనానినితో జరిగిన విషయం తెలిసిందే. అత్యంత ఆత్మీయుల మధ్య ఈ వివాహం జరిగింది. సునీత రెండోపెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారాయి. సునీత పెళ్లి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చాలా మంది సునీత నిర్ణయంపై మద్దతుగా నిలుస్తున్నారు. మరొకొందరు సునీత రెండో పెళ్లిని విమర్శిస్తున్నారు. అలాంటి విమర్శలు చేసేవారికి మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చాడు. రామ్ – సునీతలు ఇద్దరూ కూడా తమ సంతోషాలను కనుగొన్నందుకు కంగ్రాట్స్… ‘సంతోషం అనేది పుట్టుకతో ఉండదు… రాదు. దాన్ని మనం వెతుక్కోవాలి. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకడుగు వేసే వారికి.. కొన్నింటిని ఎంచుకునేందుకు సిగ్గుపడేవారికి ఉదాహరణగా మీ జంట నిలిచింది.. ప్రేమ సంతోషం అనేది ఎప్పటికీ మీ పర్మనెంట్ అడ్రెస్ గా మారాలని కోరుకుంటున్నాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్” అని నాగబాబు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు.

follow us