నా పిల్లల విషయంలో ఆ తప్పు చేశాను: నాగబాబు

  • Written By: Last Updated:
నా పిల్లల విషయంలో ఆ తప్పు చేశాను: నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు రీసెంట్ గా “మన చానల్ మన ఇష్టం” అనే యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ చానెల్ ద్వారా ఎన్నో విషయాలను తెలియజేస్తున్నాడు. ఇక కెరీర్ పరంగా చూసుకుంటే మొదట హీరో గా ఎంట్రీ ఇచ్చిన నిలబలేకపోయాడు. కానీ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా తన ప్రయాణం మొదలు పెట్టాడు. మెగా ఫ్యామిలి అనే బ్రాండ్ సఫోర్ట్ ఉన్న కాని కష్టాన్ని నమ్ముకుని పైకి వచ్చిన వారిలో నాగబాబు ఒక్కరు.

తను స్టార్ట్ చేసిన యూట్యూబ్ చానెల్ ద్వారా మొదటి సారి తన ఫ్యామిలి, పర్శనల్ విషయాలను అందరితో షేర్ చేకున్నాడు. నేను నా జీవితంలో నిహారికా, వరుణ్ విషయంలో ఓ తప్పు చేశాను. ఆ సమయంలో నాకు మెచ్యూరిటీ లేదు. అందుకే వాళ్ళను తిట్టి, కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో పిల్లలకు కన్న ఎవరు కాదు.

మరల నా పిల్లల విషయంలో నేను ఏ తప్పు చెయ్యదలుచుకోలేదు. అందుకే వరుణ్ నేను హీరో అవ్వుతా డాడీ అన్నపుడు నేను వాడితో ఒక్కటే చెప్పాను కష్ట పడాలి, సక్సెస్ కానప్పుడు బాధ పడొద్దని చెప్పాను. నిహారికా ను కూడా తను సినిమాల్లో నటిస్తా అన్నప్పుడు అభ్యంతరం చెప్పదలుచుకోలేదు. ఈ సందర్భంగా తల్లి తండ్రులకు నేను చెప్పేది ఒక్కటే వాళ్ళకు అర్థం అయ్యేలా చెప్పాలి తప్ప, వాళ్ళ మనసును గాయపరిచే విదంగా ప్రవర్తించొద్దు. మన ప్రవర్తనలో మార్పు అనేది వస్తే అది సాధ్యం అవ్వుతుంది అన్నారు.

follow us