‘లవ్ స్టోరీ’ అంత బిజినెస్ చేస్తుందా

అక్కినేని నాగ చైతన్య ‘వెంకీ మామ’ చిత్రం తరువాత శేకర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. కరోనా కారణంగ ఆలస్యం అవ్వుతూ వస్తున్న చిత్రం ఎట్టకేలకు పూర్తి చేసుకుంది. “ఫిధా” చిత్రం తరువాత దర్శకుడు చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కు మంచి రెస్ఫాన్స్ వచ్చింది. చైతు బర్త్ డే సందర్భంగా విడుదలైన పోస్టర్ కూడా మంచి ప్రేక్షక ఆధారణ లభించింది.
ఈ చిత్రంను మేకర్స్ ఇప్పటి వరకు 35 కోట్లు పెట్టి నిర్మించారు అందుకే ఓటీటీలో విడుదలకు కు నో చెప్పుతు వస్తుంది. తెలుగు రాష్ట్రాలో ఇప్పుడిప్పుడే థియేటర్స్ ఓపెన్ అవ్వుతున్నాయి కాబట్టి త్వరలోనే అక్కడే విడుదల చెయ్యాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రంను అన్నీ రైట్స్ కలిపి 40 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుందని మేకర్స్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఈ చిత్రాన్నికి పవన్ సి హెచ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.