చిరు నాగ్ పొత్తులో ఓటీటీ.. ?

టాలీవుడ్ స్టార్ హీరోలు నాగార్జున మరియు మెగాస్టార్ కలిసి కొత్త బిజినెస్ ప్రారంభించబోతున్నారట. ఆ బిజినెస్ ఏదో కాదు ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ఓటీటీ బిజినెస్ ను నాగ్ చిరు పాట్నర్ షిప్ లో మొదలు పెట్టబోతున్నారట. ఇప్పటికే వీరిద్దరూ కలిసి మాటీవీ ఛానల్ ను మొదలు పెట్టారు. ఇక ఛానల్ సక్సెస్ అయ్యాక అమ్మేశారు. కాగా ఇప్పుడు కూడా ఓటీటీ సంస్థను స్థాపించి మరోసారి పార్ట్నర్లు అవ్వబోతున్నారట. నిజానికి నాగార్జున ఓటీటీ ని మొదలు పెట్టబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తన నిర్మాణంలో వస్తున్న 12 చిన్న సినిమాలను కూడా తన ఓటీటీలోనే రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నట్టు గుసగుసలు వినిపించాయి.
అయితే ఇప్ప్పుడు నాగ్ మెగాస్టార్ తో పొత్తు పెట్టుకోవలనుకుంటున్నారట. దాంతో మెగా అక్కినేని హీరోల సినిమాలతో పాటు మెగా హీరోల సినిమాలు కూడా తమ ఓటీటీ లో విడుదల అవుతాయని..దాంతో సులభంగా బిజినెస్ లో రాణించవచ్చని అభిప్రాయపడుతున్నారట. ఇదిలా ఉండగా ఇపప్టికే తెలుగులో నిర్మాత అల్లు అరవింద్ ఆహా ను ప్రారంభించి సక్సెస్ అయ్యారు. మరి నాగార్జున సింగిల్ గా ఓటీటీ రంగంలోకి అడుగుపెడతారా లేదంటే మెగాస్టార్ తో కలిసి రంగంలోకి దిగుతారా చూడాలి.