ఎట్టకేలకు మొదలు పెట్టబోతున్న బంగార్రాజు..! ఎప్పుడంటే ?

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన చిత్రం “సోగ్గాడే చిన్నినాయన” ఆ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. గత కొంతకాలంగా ఆ చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు. అదే పనిగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి నాగార్జున తో ఓకే అనిపించుకుని. సీక్వెల్ చేసే పనిలో ఉన్నాడు. చాలా కాలంగా చిత్రం షూటింగ్ ఏదో కారణం గా పోస్ట్ పోన్ అవ్వుతు వస్తుంది. ఆ చిత్రంలో బంగార్రాజు పాత్రకు బాగా పేరు రావడం తో ఆ పేరుతోనే సీక్వెల్ కు ప్లాన్ చేస్తున్నాడు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నటించిన రమ్య కృష్ణ బంగార్రాజు లో ఓ కీలక పాత్రలో నటించబోతుంది.
బంగార్రాజు చిత్రం షూటింగ్ ను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో మొదలు పెట్టి, ఫస్ట్ షెడ్యూల్ లోనే నాగార్జున పైన వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లుగా, సినీ వర్గాలనుండి సమాచారం. నాగ్ మరోసారి బంగార్రాజు గెటప్ లో తెల్ల పంచ కొర మీసం చేతిలో కర్ర తో నటిస్తాడా లేక మోడ్రన్ లుక్ లో కనిపిస్తాడా అనే విషయం తెలవాలంటే మరికొన్ని రోజుల వరకు అగాలిసిందే. అక్కినేని ఫాన్స్ మాత్రం నాగ్ బంగార్రాజు లుక్ కోసం ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు మరి కొద్దీ రోజుల్లోనే ఫుల్ స్టాప్ పడనున్నది. వరస ఫ్లాప్స్ ను చవి చూస్తున్న నాగ్ ఈ చిత్రం తో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు.
నాగ్ ప్రస్తుతం వైల్డ్ డాగ్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రాన్ని కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమన్ దర్శకత్వం వహిస్తున్నాడు. యన్ఐఏ ఏజెంట్ గా, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నాగ్ నటిస్తున్నాడు. ఆ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్స్ సయామి ఖేర్, దియా మీర్జాలు కీలక పాత్రలో నటిస్తున్నారు.