తాతగా నాగ్…మనవడిగా అఖిల్ ..!

  • Written By: Last Updated:
తాతగా నాగ్…మనవడిగా అఖిల్ ..!

కింగ్ నాగార్జున సరైన హిట్ లేక సతమతమవుతున్న సమయంలో సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించగా నాగ్ ద్విపాత్రాభినయం చేశారు. సినిమాలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్ లుగా నటించి అలరించారు. అయితే ఈ సినిమాలు సీక్వెల్ రాబోతుందని ఇప్పటికే నాగార్జున వెల్లడించారు. అంతే కాకుండా సీక్వెల్ కు కూడా కళ్యాణ్ కృష్ణ ఏ దర్శకత్వం వహించినబోతున్నారు. కాగా ఈ సినిమా కథ పై తాజాగా ఓ ఇంటస్టింగ్ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

సినిమాలో నాగార్జున బంగ్గారాజు క్యారెక్టర్ లో నటిస్తుండగా నాగ చైతన్య ఆయన కొడుకుగా నటిస్తారట. అంతే కాకుండా నాగ చైతన్య కొడుకుగా…నాగ్ మనవడిగా అఖిల్ నటిస్తున్నారట. అయితే ఇది ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న వార్త మాత్రమే దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇటీవ‌లే నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాతో థియేట‌ర్లో సంద‌డి చేశారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. అయితే ఓటీటీలో మాత్రం ఈ చిత్రానికి మంచి స్పంద‌న ల‌భించిన‌ట్టు నాగార్జున ఓ ఇంట‌ర్యూలో వెల్ల‌డించారు.

follow us