ప్లాప్ డైరెక్టర్ ను ఆదుకుంటున్న కింగ్ నాగార్జున

ప్లాప్ డైరెక్టర్ ను ఆదుకుంటున్న కింగ్ నాగార్జున..కొత్త డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇవ్వడం , ప్లాపుల్లో ఉన్న డైరెక్టర్స్ కు అవకాశం ఇవ్వడం లో నాగార్జున ముందుంటారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు. నీ కోసం సినిమాతో డైరెక్టర్ గా చిత్రసీమ కు పరిచమైన శ్రీను వైట్ల..ప్రస్తుతం ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్నాడు. అసలు శ్రీను వైట్ల అని పేరును కూడా చాలామంది మరచిపోయారు. ఒకప్పుడు రామ్ తో రెడీ , విష్ణు తో ఢీ , మహేష్ బాబు తో దూకుడు, రవితేజ తో దుబాయ్ శ్రీను ఇలా ఎంతోమందికి ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన శ్రీను వైట్లతో..ప్రస్తుతం చిన్న హీరోలు సైతం సినిమాలు చేసేందుకు ఆలోచిస్తున్నారు. దూకుడు తో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీను వైట్ల..ఆ తర్వాత బాద్ షా , ఆగడు, బ్రూస్ లీ , మిస్టర్ , అమర్ అక్బర్ ఆంటోని వంటి వరుస భారీ ప్లాప్స్ ను అందుకొని ఇప్పుడు ఒక్క ఛాన్స్ కోసం అందరి హీరోల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఎవ్వరు కూడా శ్రీను తో సినిమా చేసేందుకు ముందుకు రావడం లేదు.
ఈ క్రమంలో తనతో గతంలో కింగ్ వంటి హిట్ సూపర్ హిట్ చేసిన నాగార్జున ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్నట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి దూకుడు సినిమా తర్వాత వెంటనే నాగార్జున తో సినిమా చెయ్యాల్సి ఉంది..కానీ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం రావడం తో నాగార్జున ప్రాజెక్ట్ ని పక్కకి పెట్టేసాడు. నాగార్జున అప్పట్లో దీనిపై చాలా హర్ట్ అయ్యినట్టు కూడా వార్తలు వినిపించేవి. ఇప్పుడు కెరీర్ ఎండింగ్ కి వచ్చేసింది..అవకాశాలు ఇచ్చేవాళ్ళు లేని సమయం లో నాగార్జున పిలిచి మరీ శ్రీనువైట్ల కి ఛాన్స్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇక నాగ్ సినీ కెరియర్ కూడా పెద్దగా ఏమిలేదు.మన్మధుడు 2 తో భారీ ప్లాప్ అందుకున్నాడు. ఆ తర్వాత బంగార్రాజు ఓకే అనిపించింది. ఆ తర్వాత ఘోస్ట్ భారీ ప్లాప్ అందుకుంది. ఇలా హిట్ . ప్లాప్ లతో కెరియర్ నడుస్తుంది. ఇక నాగ్ హిట్ సినిమా కలెక్షన్లు కూడా పెద్దగా ఏమీలేవు. ఈ క్రమంలో నాగ్ – శ్రీను వైట్ల కాంబో సినిమా అంటే చాలామంది భయపడుతున్నారు. మరి వీరిద్దరి కాంబో మూవీ ఎలా ఉండబోతుందో..ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.