యాపిల్ ప్రోడక్ట్స్ కొంటున్నారా జాగ్రత్త గా ఉండండి అంటున్న నాగార్జున

యాపిల్ ప్రోడక్ట్స్ కొంటున్నారా జాగ్రత్త గా ఉండండి అంటున్న నాగార్జున

టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున ఓ వైపు సినిమాలు మరో వైపు టి‌వి షో బిగ్ బాస్ తో బిజీగా ఉన్నాడు. ఇక తాజాగా యాపిల్ ప్రోడక్ట్స్ పై తన మాటలతో విరుచుకు పడ్డాడు. కంప్యూటర్స్, ఫోన్స్, ను తయారు చేస్తూ తన బ్రాండ్ ను చూపిస్తున్న యాపిల్ పై నాగార్జున కు కోపం వచ్చింది.

ఈ సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా ఇండియాలోని యాపిల్ స్టోర్స్ లలో యాపిల్ ప్రోడక్ట్స్ కొనుతున్నారా అయితే జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ సేవలు సర్వీసెస్ లు ఓ పక్క బయంకరంగా ఉన్నాయి అంటూ కోపంతో ఉన్న ఎమోజీ పెట్టాడు. ఎందుకు యాపిల్ ప్రోడక్ట్స్ పై నాగ్ అలాంటి ట్వీట్ చేశాడో తెలియాలిసి ఉంది.

నాగార్జున సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన వైల్డ్ డాగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు అనే చిత్రంలో నటించనున్నాడు.

follow us