నేషనల్ లెవల్ వెబ్ సిరీస్ లతో రాబోతున్న మన్మథుడు.!

ఎప్పుడూ కొత్తరకం పాత్రలతో ప్రేక్షకులను అరించే హీరో నాగార్జున. ఇప్పటివరకు నాగ్ ఎన్నో రకాల పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అంతే కాకుండా ఇటీవల విడుదలైన వైల్డ్ డాగ్ సినిమాలో సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ విజయ్ కుమార్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తో కొట్టింది. అయితే ఓటీటీలో విడుదల చేసిన ఈ సినిమాకు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. దాదాపు ఐదు భాషల్లో విడుదలైన ఈ చిత్రం రేటింగ్ పరంగా దూసుకుపోతుంది. ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ టీవీ ఛానల్ కు నాగ్ జూమ్ ఇంటర్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలోఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఓటీటీ వచ్చాక కొత్త టాలెంట్ భయటకు వస్తుందని నాగ్ అన్నారు. అంతే కాకుండా కొత్త దర్శకులు కొత్త ఐడియాలతో వస్తున్నారని చెప్పారు. అంతే కాకుండా తనకు రెండు నేషనల్ లెవల్ వెబ్ సిరీస్ లలో నటించే అవకాశం వచ్చిందని చెప్పారు. ఇప్పటికే కథ విన్నానని దాదాపు అవి ఫిక్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇక ఈ ప్రాజక్టులు గనక ఓకే అయితే నాగార్జున ఓటీటీలో కూడా సందడి చేయనున్నారు. ఇదిలా ఉండగా నాగార్జున తన నెక్స్ట్ బంగార్రాజు సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిస్తున్నారు.