టాలీవుడ్ మన్మధుడు నాగార్జున గ్లామర్ రోజు రోజుకు పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం 61 ఏళ్ళు ఉన్న నాగరార్జున 20 ఏళ్ల కుర్రాడిలా కనిపించడం విశేషం. ఆయన ఫిట్నెస్ కు అందానికి కారణం వేరే ఏమి లేదని నచ్చింది తింటూ వర్కౌట్స్ చేయడమేనని నాగార్జున పలు సందర్భాల్లో చెప్పారు. అంతే కాకుండా రోజంతా పని చేసి స్ట్రెస్ అవుతాం కాబట్టి రోజుకు 8 నుండి 9 గంటలు పడుకుంటానని చెప్పారు.
ఇదిలా ఉండగా నాగార్జున తాజాగా స్విమ్మింగ్ పూల్ లో దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోటోలో నాగ్ సిక్స్ ప్యాక్ లుక్స్ తో కుర్ర హీరోలు కూడా తన ముందు తక్కువే అన్నట్టు కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా నాగార్జున హీరోగా నటించిన వైల్డ్ డాగ్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. అంతే కాకుండా ఆయన నటిస్తున్న బాలీవుడ్ సినిమా లో ఇటీవలే తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్నారు.