బాలయ్య తప్పుకున్న సినిమాలో నాగ్.!

nagarjuna to act with nagashourya in multi starrer
nagarjuna to act with nagashourya in multi starrer

అప్పట్లో యంగ్ హీరో నాగశౌర్య టాలీవుడ్ లెజెండ్ బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ యంగ్ డైరెక్టర్ నాగశౌర్య కు ఓ కథను చెప్పాడు. ఆ సినిమాలో ఒక స్టార్ హీరోకు అవకాశం ఉన్న పాత్ర ఉంది. దాంతో ఆ కథను బాలయ్య వద్దకు తీసుకెళ్లాడు. ఆ సినిమా స్టోరీ బాలయ్యకు నచ్చడంతో ఒకే చెప్పేసాడు. దాంతో ఈ ప్రాజెక్టు ఒకే అవుతుందని అనుకున్నారు. కానీ బాలకృష్ణ మళ్ళీ ఆ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారట.

ప్రస్తుతం బాలయ్య బోయపాటి తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక బాలకృష్ణ గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో మైత్రీమూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమాలో నటించబోతున్నాడు. దాంతో డేట్స్ సమస్య వచ్చి నాగశౌర్య తో మల్టీస్టారర్ కు సున్నితంగా నో చెప్పారు. అయితే ఇప్పుడు ఆ స్టోరీని దర్శకుడు నాగార్జున వద్దకు తీసుకెళుతున్నారట. బాలకృష్ణ ఒకే చెప్పిన స్టోరీ కాబట్టి నాగ్ కూడా ఒకే చెప్పే అవకాశం ఉంది. మరి నాగ్ ఈ మల్టీస్టారర్ లో నటిస్తారా లేదా చూడాలి.