willd dog review : వైల్డ్ డాగ్ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా.?

వైల్డ్ డాగ్ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని లాక్ డౌన్ వేళ ఓటీటీలో విడుదల చేయాలని థియేటర్ విడుదల వరకు వచ్చిన సినిమా. ఓటీటీ ఒప్పందం చేసుకుని మళ్లీ థియేటర్ లోనే ఈ సినిమాలను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఇక ఈ సినిమాపై నాగ్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంతే కాకుండా ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా నాగ్ వైల్డ్ డాగ్ కోసం ప్రమోషన్స్ చేశారు. ఇక ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం విడుదలైన వైల్డ్ డాగ్ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా లేదా ఇప్పుడు చూద్దాం.
కథ : ఈ సినిమా కథ గురించి పెద్దగా చెప్పుడకోవడానికి లేదు. ముందు నుండి నాగార్జున పలు ఇంటర్య్వూలలో చెప్పినట్టుగా సింపుల్ కథతో సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ చూసినా ఈ సినిమా కథ అర్థం అయిపోతుంది. పూణేలో ఇక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. దానికి కారణం ఖలీద్ అనే ఉగ్రవాది. అతన్ని పట్టుకోవడానికి ఎన్ ఐ ఐ విజయ్ వర్మ అనే అధికారిని నియమిస్తుంది. అతడితో పాటు నియమించబగిన టీమే వైల్డ్ డాగ్. ఖలీద్ ముంబై కు పారిపోవడంతో వైల్డ్ డాగ్ టీమ్ ముంబైకి వెళ్లి ఒక వల పన్నుతుంది. కానీ చివరి క్షణాల్లో ఖలీద్ తప్పించుకుంటారు. అక్కడ నుండి నేపాల్ పారిపోతాడు. ఇక అతడిని పట్టుకోవడానికి వైల్డ్ డాగ్ బృందం నేపాల్ వెలుతుంది. నేపాల్ లో వైల్డ్ డాగ్ ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా అన్నదే అసలు కథ.
కథనం : ఇది ఒక జోనర్ ప్రేక్షకులకు మాత్రమే నచ్చే కథ. అయినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా దర్శకుడు అహిషోర్ సాల్ మన్ తెరకెక్కించాడు. కథనం ఎక్కడా బిగి సడలకుండా కథను నడిపించాడు. సినిమాలోని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేలా చేస్తాయి. సినిమాలో ఫస్ట్ హాస్ నెమ్మదిగా సాగినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం అసలైన ఆపరేషన్ వైల్డ్ డాగ్ మొదలవుతుంది. కథ ముందుకు సాగుతున్నప్పటికీ సినిమాపై ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో లాజిక్ లు మిస్ అయినట్టు అనిపిస్తుంది కానీ అవి పెద్దగా ప్రభావం చూపించలేక పోయాయి. ఇక దాడికి కారణమైన మూలాలు నేపాల్ లో ఉన్నాయనే సమాచారంతో అక్కడకు వెళ్లిన టీం చేసే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుడిని కట్టిపడేశాయి. అయితే ఈ సినిమాలో పాటు లేకపోవడం కొంతవరకు మైనస్ గా అనిపించింది.అయితే తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్ గా అనిపిస్తుంది. ఇక సినిమా విజయ్ వర్మగా నాగార్జున యాక్టింగ్ లో అదరగొట్టారు. అంతే కాకుండా హీరోయిన్ నయామీకేర్ కూడా నటనతో ఆకట్టుకుంది. దర్శకుడు కొత్త వాడైనప్పటికీ సినిమాను తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంది.ఇక రొమాంటిక్ హీరో నాగార్జున సినిమాలో రొమాన్స్ లేకపోవడాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో చూడాలి.
ప్లస్ లు :కథ, కథనం, నటీనటుల పర్ఫామెన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్
మైనస్ లు : పాటలు లేకపోవడం, లాజిక్ లేని కొన్ని సన్నివేశాలు
ఒక్క మాటలో చెప్పాలంటే : ఆపరేషన్ వైల్డ్ డాగ్ సక్సెస్