వీడియో : మహేష్ నవ్వులను షేర్ చేసిన నమ్రత

ప్రిన్స్ మహేష్ బాబు, నమ్రతను ప్రేమ వివాహం చేసుకున్నా సంగతి తెలిసిందే. వీరికి గౌతమ్, సితారా అనే ఇద్దరు పిల్లలున్నారు. ఎంతో మందికి ఈ జంట ఆదర్శ దంపతులుగా నిలుస్తున్నారు. మహేష్ బాబు కి సంబందించిన ప్రతి విషయం ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. ఆ మధ్య ఎయిర్పోర్టు లో మహేష్ కు సంబంధించిన ఓ పిక్ ఒక్కటి పోస్ట్ చెయ్యడం తో బాగా వైరల్ అయ్యింది.
రీసెంట్ గా మహేష్ బాబు సిగ్గు పడుతూ తల వంచుకుని నవ్వుతున్న వీడియోనూ “స్మైల్ ఆఫ్ ది డే” అంటూ పోస్ట్ చేస్తూ మహేష్ బాబుకు ట్యాగ్ చేసింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ అభిమానులు మాత్రం తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెటిజన్స్ మాత్రం ఖలేజా సినిమాలోని ఓ డైలాగ్ నూ గుర్తు చేస్తూ “నీ నవ్వు వరం స్వామి నీ కోపం శాపం స్వామి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఎన్నో సేవ కార్యక్రమాలను ఈ జంట నిర్వహించింది. “తను శ్రీ” అనే పాపకు మహేష్ బాబు గుండె ఆపరేషన్ చేయించిన సంగతిని నమ్రతా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇక సినిమా విషయానికి వస్తే… ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు “సర్కారు వారి పాట” అనే చిత్రంలో నటిస్తున్నాడు. మహేష్ సినిమా డేట్స్ అన్ని నమ్రతా నే చూసుకుంటుంది.