మహేష్ తో రిలేషన్ లో ఉన్నప్పటి విషయాలను తెలిపిన నమ్రత

మహేష్ తో రిలేషన్ లో ఉన్నప్పటి విషయాలను తెలిపిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ – నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి హడావిడి లేకుండా వీరి వివాహం జరిగింది. చాల నెలల పాటు కూడా వీరికి వివాహం అయినా సంగతి కూడా తెలియదు. అయితే మొదట్లో వీరి రిలేషన్ ఎలా ఉంది..ఎలా ఉండేవారు అనే విషయాలు ఇప్పటివరకు తెలియదు. అయితే తాజాగా ఆ విషయాలను నమ్రత పంచుకుంది.

మహేష్ చాలా ఎంటర్టైనింగ్ పర్సన్. తనతో ఉంటే సమయం తెలిసేది కాదు. తనతో ఎంత సమయం గడిపినా బోర్ కొట్టేది కాదు. నచ్చే విషయాలు చెబుతూ హ్యాపీ గా ఉంచేవారని .. ఇక మహేష్ సినిమాల షూటింగ్ లొకేషన్స్ కి తరచుగా వెళ్లేదాన్ని.. షూటింగ్ అయిపోగానే ఇద్దరూ కలుసుకునే వారమని నమ్రత చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో మహేష్ ఫ్రెండ్స్ నమ్రతకు కూడా క్లోజ్ అయ్యారట. అలా ఇద్దరూ చాలా ఆనందంగా రిలేషన్ ఎంజాయ్ చేశారట. అలాగే మహేష్ సిస్టర్ మంజుల నమ్రతకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యారట. మహేష్ తో లాంగ్ రిలేషన్ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యామని తెలిపింది.

follow us